కాంగ్రెస్ మోసాలను గ్రామగ్రామాన ఎండగట్టాలి

పోరుబాట సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపు

కాంగ్రెస్ మోసాలను గ్రామగ్రామాన ఎండగట్టాలి

పెద్దపల్లి : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న ‘పోరుబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన పోరుబాట సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు మాటలకే పరిమిత మయ్యా యని, చేతల్లో అమలు కనిపించడం లేదని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సమావేశానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని మనోహర్‌రెడ్డి కోరారు.

WhatsApp Image 2026-08-31 at 4.36.05 PM (1)

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!