పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

  • ఉద్యోగుల ఆకాంక్షను ప్రభుత్వాలు గౌరవించాలి
  • ఓపీఎస్ పునరుద్ధరణే ఉద్యోగ వర్గాల ప్రధాన డిమాండ్

అక్కన్నపేట: దేశవ్యాప్తంగా పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ అంశం రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి చేరిందని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జాతీయ కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం దెహ్రాదూన్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన పెన్షన్ మార్చ్, భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.దక్షిణ భారతదేశంలో ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించిన పార్టీలకు ఉద్యోగ వర్గాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నిలబెట్టుకుని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్ భద్రతకు భరోసా కల్పించేలా పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాల నుంచి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా పెన్షన్ మార్చ్‌లో పాల్గొని ఓపీఎస్ పునరుద్ధరణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. ఉద్యోగుల సామాజిక భద్రత, పదవీ విరమణ అనంతర జీవన భరోసా కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని స్థితప్రజ్ఞ అన్నారు.ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల చిరకాల డిమాండ్ అయిన పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.