నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు,అక్కచెల్లెళ్లకు,అన్నదమ్ములకు,యువతీ యువకులకు,మీడియా మిత్రులందరికీ వినాయక చవితి సందర్భంగా సోమవారం పేదల పెన్నిధి ప్రతి పేద వాడి కుటుంబంలో ఆపదలో ఉంటే నేనున్నా అని భరోసనిచ్చే యువకిశోరం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే ఈ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా,భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మికవాతావరణంలో, శాంతియుతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగాకోరుకుంటున్నానని,వినాయక చవితిపండుగ సందర్భంగా వినాయక మండపాల వద్ద మనమందరం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైనవిషయాలను మీతో పంచుకుంటున్నాను.కరెంట్ వైర్ల దగ్గర జాగ్రత్త మండపాలవద్దమనయువత, నిర్వాహకులుఎంతోఅప్రమత్తంగా ఉండాలి.ముఖ్యంగా విద్యుత్ వైర్లు,విద్యుత్ స్తంభాల దగ్గర పిల్లలు,యువకులు జాగ్రత్తగా ఉండాలి.ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా అవసరమైన భద్రతాచర్యలుతీసుకోవాలి,అత్యవసర వాహనాలకు దారి ఇవ్వండి వినాయక మండపాలను రహదారులకు ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు లేదా ఇతర అత్యవసర వాహనాలు వచ్చినప్పుడు వెళ్లేందుకు ఒక్క పక్కన దారి ఖాళీగా ఉంచాలి,ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు మనం ఇచ్చే దారి ఎంతో విలువైనది,సౌండ్ బాక్సుల శబ్దాన్ని తగ్గించండి,మన పండుగ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారకూడదు.పెద్దలు,చిన్నపిల్లలు,వృద్ధులు,గుండె జబ్బులు,ఇతరతర అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బంది పడకుండా డీజేలు,సౌండ్ బాక్సుల శబ్దాన్ని పరిమితంగా ఉంచాలి.పండుగను అందరంభక్తి,ఆనందంతోజరుపుకుందాం. అధికారులకు సహకరిద్దాం,వినాయక మండపాల నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్,మున్సిపల్,గ్రామ పంచాయతీ,విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలి.ప్రజల భద్రత కోసం అధికారులు సూచించే నిబంధనలు,జాగ్రత్తలను పాటిస్తూ వారికి పూర్తి సహకారం అందించాలి.
మన నియోజకవర్గ ప్రజలకు నా చిన్న మనవి....
పండుగలు అంటే కేవలం పాటలు,నృత్యాలు,వేడుకలు మాత్రమే కాదు మనమందరం ఒకటిగా కలిసి ఉండటం,ఒకరికొకరం సహాయం చేసుకోవడం,సంతోషాన్ని పంచుకోవడమే నిజమైన పండుగ.మన పూజలు,వేడుకలుపర్యావరణానికి హానికలిగించకుండా,పక్కవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించినప్పుడే వాటికి మరింత అర్థం ఉంటుంది,భక్తితో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకుని మన నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒకఆదర్శ నియోజకవర్గంగానిలబెడదాం ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని,ప్రతి ఒక్కరి ఇల్లు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,ఐశ్వర్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానాని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

