వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.
గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ : వినాయక చవితి పండగ శుభాకాంక్షలు సోమవారం తెలిపిన పోచారం. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకు ని హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ని తన నివాసం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల తో కలిసి గణ నాథుడి కి భక్తిశ్రద్ధల తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భం గా విఘ్నాల ను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాల ను ప్రసాదించాలని పోచారం శ్రీనివాసరెడ్డి ప్రార్థించారు. తెలంగాణ ప్రజలందరి కీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా గణనాథుని ఆశీస్సులు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోచారం సతీమణి శ్రీమతి పుష్ప, కుమారుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు శ్రీమతి సోనీ రెడ్డి, మనమండ్లు రుశాంకు రెడ్డి, రిషిక్ రెడ్డి, గణపతి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


