లెంకలపల్లి రైతువేదికలో పంటల నమోదుపై అవగాహన
నల్గొండ/మర్రిగూడ:లెంకలపల్లి గ్రామంలోని రైతువేదికలో డిజిటల్ క్రాప్ సర్వే పంట నమోదుపై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి సాహస్ మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించే వాలంటీర్లకు రైతులు సహకరించి తమ పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.వానాకాలం మెలకువలు,ప్రత్యామ్నాయ పంటలుప్రస్తుత వానాకాలంలో నెలకొన్న ఎండ తీవ్రత పరిస్థితులలో పత్తి పంటలో యాజమాన్యం తీసుకోవాల్సిన తగిన మెలకువలను రైతులకు వివరించారు. అలాగే ఎల్నినో వాతావరణ మార్పుల దృష్ట్యా, నీటి కొరతను అధిగమించేందుకు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు.సన్న రకాల వరికి రూ. 500 బోనస్ రిజిస్ట్రేషన్ …
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


