కంచనపల్లిలో బియ్యం అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు?
మహబూబ్ నగర్/ మిడ్జిల్ : మిడ్జిల్ మండలపరిధి కంచనపల్లి గ్రామంలో బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో సుమారు పదేళ్లుగా ఇదే తరహా దందా కొనసాగిందని, ప్రస్తుతం కూడా గతంలో పాలనలో ఉన్నవారే ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం తరలింపు వ్యవహారంపై సంబంధిత అధికారులు నిఘా పెట్టకపోవడంతో అక్రమ రవాణాదారులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని వారు అంటున్నారు. అధికారులు స్పందించి కంచనపల్లి గ్రామంలో రేషన్ బియ్యం తరలింపుపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


