ఎస్‌టీయూటీఎస్‌ సభ్యత్వ నమోదుకు ఉపాధ్యాయుల స్పందన

ఎస్‌టీయూటీఎస్‌ సభ్యత్వ నమోదుకు ఉపాధ్యాయుల స్పందన

మంచిర్యాల / తాండూరు :మండలం రేచిని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూటీఎస్‌) సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయు లు సంఘ సభ్యత్వాన్ని స్వీకరించారు. భట్టారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..గత ఎనిమిది దశాబ్దాలుగా రాష్ట్రోపాధ్యాయ సంఘం విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తోందన్నారు. ఉపాధ్యాయులంతా సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. రెండువేల ఇరవై నాలుగులో వేసవికాలంలో నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు సంబంధించిన సంపాదిత సెలవులను (ఈఎల్‌) జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికీ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు వెంటనే చర్యలు తీసుకొని వాటిని మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాలను ప్రకటించడంతో పాటు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫార్సులను అమలు చేయాలని, సాధారణ భవిష్య నిధి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం, సంపాదిత సెలవులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిం చాలని కోరారు. కార్యక్రమంలో రవిబాబు, కృష్ణగౌడ్‌, రాజేంద్రప్రసాద్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, మధుకర్‌, శ్రీలత, సుకుమాంజలి తదితరులు పాల్గొన్నారు. 

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News