అల్లా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి.
- ముర్షద్ దర్గా ఉత్సవాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
- ఘనంగా ప్రారంభమైన ముర్షాద్ దర్గా ఉత్సవాలు.
- ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ పలువురు ప్రముఖులు.
తాండూరు, (వికారాబాద్ జిల్లా) తాండూరు పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ముర్షద్ దర్గా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దర్గాలోని దర్గా సమాధిపై పూలు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన 'జల్సా-ఎ-సీరత్-ఎ-ఔలియా' కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అల్లా దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.ఉత్సవాలు సోదరభావానికి ప్రతీక ముర్షద్ దర్గా ఉత్సవాలని అన్నారు. ఇక్కడికి కుల మతాలకతీతంగా పెద్ద ఎత్తున ఉత్సవాలకు ప్రజలు తరలి వస్తారని అల్లా దయతో సర్వం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజ్, కౌన్సిలర్లు నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్ గనిపాష, దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం పాష, సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా, షరీఫ్‌తో, హజ్రత్ సయ్యద్ అబ్దుల్ సలాం పాష సాహెబ్ చిష్త, పట్టణ ప్రముఖులు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
