ముత్యాలంపాడులో విత్తన మేళా ప్రారంభం .

 ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలపై దృష్టి

ముత్యాలంపాడులో విత్తన మేళా ప్రారంభం .

టేకులపల్లి / భద్రాద్రి కొత్తగూడెం :  టేకులపల్లి మండలం ముత్యాలంపాడు రైతు వేదికలో సోమవారం విత్తన మేళాను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, విత్తన డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా పెసర, కంది, మినుము తదితర పంటల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు మాట్లాడుతూ, రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకుని తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను సకాలంలో పొందాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా పెసర, మినుము, కంది, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేసి ప్రభుత్వ సూచనలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జె. కిషోర్, కేవీకే శాస్త్రవేత్త భరత్, ఏడీఏ లాల్‌చంద్, ఏవో అన్నపూర్ణ, ఏఈఓలు భాగ్యశ్రీ, రెహానా, గౌస్, ప్రవీణ్, సర్పంచ్ పూలభంతి, ఉపసర్పంచ్ చేతుల నాగేశ్వరరావు, శివలాల్, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
Views: 55

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News