బాలల భద్రతకు పెద్దపీట..

బాలల భద్రతకు పెద్దపీట..

  • వరంగల్‌లో పీడియాకాన్‌–2026 సందడి
  • బాలలపై హింస నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

హన్మకొండ: బాలల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ బాల వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్‌లో బాలలపై హింస నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలలపై జరుగుతున్న హింస, వేధింపులు, దుర్వినియోగాన్ని గుర్తించి నివారించడంతో పాటు ప్రతి చిన్నారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐఏపీ ఈ బి  డాక్టర్ బి. సుగుణా కర్ రెడ్డి, పి ఏ టి యస్  అధ్యక్షుడు డాక్టర్ గూడురు విజయ్ కుమార్, వరంగల్ బాల వైద్యుల అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ జి.రమేష్ మాట్లాడుతూ.. బాలల రక్షణ కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలల్లో శారీరక, మానసిక మార్పులను గుర్తించి సకాలంలో స్పందిం చడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలోడా శ్రీరామ్ రెడ్డి , డాక్టర్ ఎస్. కృష్ణమూర్తి, డా. సుంకోజ్ భాస్కర్, డా. ఎన్.ఎల్. శ్రీధర్, డా. రాజీవ్ డా జగదీష్, డా అశోక్, డా సంధ్య, డా సభియా, డా.ఎం. శేషు మాధవ్, డా కరుణాకర్ గారే, డా బలరాం, డా భోజా, డా. పి. అనిల్ కుమార్, డా. అన్వేషిణి పాల్గొన్నారు. భారతీయ బాల వైద్యుల సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ నీలం మోహన్, అధ్యక్ష పదవికి ఎన్నికైన డాక్టర్ ఎం. సింగరవేలు తదితర ప్రముఖ బాల వైద్యులు హాజరయ్యారు. ఇదే సందర్భంగా భారతీయ బాల వైద్యుల సమాఖ్య కేంద్ర మండలం, 12వ తెలంగాణ రాష్ట్ర సదస్సు పీడియాకాన్‌–2026కు వరంగల్ వేదికైంది. ఆగస్టు 28, 29, 30 తేదీల్లో సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగే ఈ సదస్సుకు “పీడియాట్రిక్స్ రీడిఫైన్డ్ – ప్రెసిషన్, ప్రివెన్షన్ అండ్ ప్రాక్టీస్” ప్రధాన ఇతివృత్తంగా ఉంది. మూడు రోజుల సదస్సులో బాలల వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు, వ్యాధుల నివారణ, బాలల ఆరోగ్య పరిరక్షణ, పిల్లల టీకాల పై వైద్య నిపుణులు చర్చించనున్నారు. బాలల ఆరోగ్యం.. భద్రత.. భవిష్యత్తు కోసం వైద్య విజ్ఞానాన్ని, సామాజిక బాధ్యతను కలిపే వేదికగా పీడియాకాన్‌–2026 నిలవనుంది.

Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!