పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి
మంచిర్యాల టౌన్ ఈరోజు శంషాబాద్ లో బీజేపీ రంగరెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ ఫీజుల బకాయి- బీజేపీ లడాయి పేరుతో చేస్తున్న ఒక్క రోజు దీక్షకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ రఘునాథ్ వెరబెల్లి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్థులను మానసిక వేదనకు గురి చేస్తుందని రఘునాథ్ అన్నారు. ప్రభుత్వం కళాశాలకు ఫీజులు చెల్లించకపోవడంతో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్ లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యా చదవలేక మరియు ఉద్యోగం రాక భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించే వరకు విద్యార్థులకు అండగా ఉండి బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


