ముత్తారంలో ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు

ముత్తారంలో ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు

ముత్తారం,: మండల స్థాయి ఎస్‌జీఎఫ్‌ (స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌) క్రీడా పోటీలు సెప్టెంబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు ముత్తారం మండలం దరియాపూర్‌ మోడల్‌ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు ఎంఈఓ హరి ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్‌ 1న బాలికలకు కబడ్డీ, ఖోఖో,వాలీబాల్‌,2న బాలురకు ఆయా పోటీలు నిర్వహించనున్నారు. 3న బాలబాలికలకు అథ్లెటిక్స్‌ పోటీలు ఉంటాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచినక్రీడాకారులను సెప్టెంబర్‌ 7 నుంచి 9 వరకు మంథనిలో జరిగే జోనల్‌ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. క్రీడాకారులు ఫొటోతో కూడిన ఎస్‌జీఎఫ్‌ ఎలిజిబిలిటీ ఫారం, ఆధార్‌ కార్డుతో పోటీలు జరిగే వేదికకు హాజరు కావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు కే.వెంకటేష్‌ (9989844458), డి.రజిత (9603305700)ను సంప్రదించాలని తెలిపారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!