ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు.

గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్  వి. విజయలక్ష్మి అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.తెలుగు కవి మరియు వ్యవహారిక భాషోద్యమ పితామహుడుగా "గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు" గారి,163 జయంతిని పురస్కరించుకుని ఈ రోజు కళాశాల లో తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది.రామ్మూర్తి తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఆయన తన జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేశారు.తెలుగు భాష గొప్పతనాన్ని, చరిత్రను, మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, భాష యొక్క అందాన్ని అభినందించడానికి, తెలుగు మాట్లాడే సమాజానికి భాష పరిరక్షణ, ప్రచారం పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటిం చడానికి గిడుగు వెంకట రామ్మూర్తి మరియు ఇతర తెలుగు రచయితల సేవలను గుర్తుచేసుకోవడానికి కూడా ఇది ఒక రోజన్నారు.దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగు ను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడ తో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందన్నారు. ఈ  కార్యక్రమాన్ని తెలుగు విభాగం దీపిక, భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించిందుకు  అధ్యాపక బృందం అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రభాకర్,  ఎన్ఎస్ఎస్ పిఓ పాక ధర్మపురి, ఐ క్యు ఎ సి కోఆర్డినేటర్ డాక్టర్ వై ఆంజనేయులు, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ్, డాక్టర్ .కె. వి.భిక్షమయ్య,ఎ.మనోహర్, బి.శ్రీనివాస్, మహేష్,కృష్ణ ప్రసాద్, శంకర్, అఖల్య, తదితర అధ్యాపకులు  విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News