విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం:బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ
వనపర్తి : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఒకరోజు నిరసన కార్యక్రమం, నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అరవింద్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బొక్క బాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై దీక్షకు మద్దతు తెలి పారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాలేజీల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోవడం వల్ల ఉన్నత విద్యను కొనసాగించేందుకు, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి భారీ ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బొక్క బాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రైవేట్ కళాశాలల లెక్చరర్ల సంఘం మద్దతు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల డిమాండ్‌తో బీజేపీ నిర్వహిస్తున్న పోరాటానికి ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. వినోద్ కుమార్, రమేష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లికార్జున్, అమరేందర్, రాజేష్, సైదులు, రవి, విజయకుమార్ తదితరులు దీక్షకు మద్దతు ప్రకటించారు గత మూడు నెలలుగా బీజేపీ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థుల పక్షాన రాజకీయాలకు అతీతంగా బీజేపీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు, వివిధ మండలాల నుంచి బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, విద్యార్థినులు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సబిరెడ్డి వెంకటరెడ్డి, మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కృష్ణ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, జిల్లా అధికార ప్రతినిధి కంచ ఆంజనేయులు, రాష్ట్ర మహిళా మోర్చా సభ్యురాలు అలివేల, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొమ్ము శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గంధం ప్రవీణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత, కిసాన్ మోర్చా అధ్యక్షులు అరవింద్ రెడ్డి, మైనార్టీ మోర్చా నాయకులు కలీల్, విద్యార్థులు, విద్యార్థినులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


