ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!
SIR సర్వే.. పింఛన్ల పరిశీలనతో పెరిగిన పనిభారం
మిడ్జిల్ మిడ్జిల్: గ్రామపంచాయతీల పరిపాలనలో కీలకంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై ప్రస్తుతం పని ఒత్తిడి పెరుగుతోంది. సమగ్ర సవరణ సర్వే (SIR)లో భాగంగా గ్రామాల్లో వివరాల సేకరణ, వికలాంగుల పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లకు సంబంధించిన వివరాల పరిశీలనతో పాటు నిత్య పరిపాలనా విధులు నిర్వహించాల్సి రావడంతో కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ వంటి సాధారణ విధులు కొనసాగుతుండగా, మరోవైపు SIRకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సి వస్తోంది. దీంతో నిర్ణీత సమయంలో అన్ని పనులను పూర్తి చేయడం కార్యదర్శులకు సవాల్‌గా మారుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిపై పనిభారం ఎక్కువ కాకుండా అవసరమైన సిబ్బంది, సమయం, సాంకేతిక సహకారం అందించాలని కార్యదర్శులు కోరుతున్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పనులను ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలని పలువురు సూచిస్తున్నారు .పనిభారం సమతుల్యం చేసి, క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సహకారం అందిస్తే SIR పనులు మరింత సమర్థవంతంగా పూర్తయ్యే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


