బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి

- తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ 

బహుజన వీరుడు,  

నల్గొండ /మర్రిగూడ:నిరుపేదల రక్షణ కోసం, అన్యాయాలపై పోరాడి బహు జనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయుడు తెలంగాణ రాబిన్ హుడ్ అయినటువంటి పండగ సాయన్న ముదిరాజ్, గారి జయంతి మరియు వర్ధంతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి జీవో ఎంఎస్ నెంబర్ 84/PSCM/2026 ప్రకటించడాన్ని యావత్ తెలంగాణ ముదిరాజ్ సమాజం హర్షిస్తుంది అందులో భాగంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నుండి హైదరాబాద్ బైపాస్ మరియు నల్గొండ బస్టాండ్ నుండి క్లాక్ టవర్ వరకు ఈ యొక్క మహనీయుని విగ్రహాన్ని స్థాపించడానికి స్థలం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నల్లగొండ జిల్లా పక్షాన కలెక్టర్ ను కోరడం జరిగింది. అందుకు వారు స్పందిస్తూ  అనువైన స్థలం సూచించేందుకు సుముకత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు బొమ్మరబోయిన రాజు ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ ముదిరాజ్, చెన మోని  రాములు ముదిరాజ్, దుడ్డు కృష్ణమూర్తి ముదిరాజ్, లోకనబోయిన రమణ ముదిరాజ్, కొరివి శంకర్ ముదిరాజ్, దోటి శ్రీను ముదిరాజ్ , బైరగోని శంకర్ ముదిరాజ్, పిట్టల నాగన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 141

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!