ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం
మంచిర్యాల టౌన్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ మహంకాళి అంజయ్య పదవి విరమణ మహోత్సవం కార్పొరేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహంకాళి అంజయ్య తన ఉద్యోగ విధి నిర్వహణలో తాను చేసిన ఉద్యోగ సేవలు గురించి మాట్లాడుతూ అభినందన లు తెలియజేశారు అంతేగాక ఉద్యోగులందరూ కూడా తనను ఆదర్శంగా తీసుకొని మిగతా ఉద్యోగులు కూడా తనలా ఉద్యోగ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ పూదరి ప్రభాకర్, వెంకట సాయి కృష్ణ, కార్పొరేషన్ సిబ్బంది అంజయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


