మహిళా కమిషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.
చేర్యాల : పట్టణలోని కస్తూరిబా విద్యాలయంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషన్ కారదర్శి పద్మజ రమణ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పద్మజ రమణ మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహ చట్టం, పొక్సో యాక్ట్, మెన్స్ట్రుయల్ హైజీన్, పౌష్టికాహారం, సైబర్ క్రైమ్, హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖధికారి బి.నరేందర్ కమిషన్ ఎస్ఓలు, భారతి,సుల్తానా శ్రీమతి సునీత కమిషన్ కౌన్సిలర్ కవిత, సిద్ధిపేట జిల్లా డిడబ్ల్యూఓ శారద,మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ మూడవ వార్డ్ కౌన్సెలర్ కొమ్ము రాజేశ్వరి జిల్లా జెండర్ &ఈక్వయిటీ co ఆర్డినేటర్ నర్మదా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ క్రిష్ణవేణి సిడిపిఓ రమాదేవి మెడికల్ ఆఫీసర్ హరిత చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్సై దివ్యా,షి టీమ్స్ స్వప్న, డిసిపీఓ రాము సోషల్ వర్కర్ అనిత, ఉమెన్ హబ్ శ్వేత, నాగరాజు, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ ప్రసాద్, కనకరాజు,లెక్చరర్స్, టీచర్స్ మరియు కేజీబీవీ &మోడల్ స్కూల్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


