ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు భాషా దినోత్సవ వేడుక
హుస్నాబాద్ : ఆంగ్ల భాష వ్యామోహంలో మాతృభాషను మరవకూడదని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయ్ బిక్షపతి తెలిపారు.ఈ సందర్బంగా శనివారం రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా శతక పద్య పఠనాన్ని చేపట్టారు.స్వర్గీయ గిడుగు రామ్మూర్తి జన్మదిన సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. అని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యార్థులకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని తెలిపారు. భావవ్యక్తీకరణ, ఉద్వేగ వికాసాభివృద్ధికి మాతృభాష తోడ్పడుతుందని వివరించారు.సామాజిక మాధ్యమాల ప్రభావం వలన ఏ భాషను కూడా స్పష్టంగా నేర్చుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషలో ఉన్న అమూల్యమైన సాహిత్య సంపదను తెలుసుకోవాలంటే మాతృభాష పరిజ్ఞానం తప్పనిసరి అని తెలిపారు. విద్యార్థులు వేమన, సుమతి, భాస్కర, కుమార శతకాలలోని పద్యాలను చదివి తాత్పర్యాలను వివరించారు. జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ డా. బి. నైనా దేవి మాట్లాడుతూ వ్యవహారిక భాష ఉద్యమానికి గిడుగు రామ్మూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


