పేదల సంక్షేమమే..
- గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం
- నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
- ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఎమ్మెల్యే
నల్లబెల్లి(వరంగల్ జిల్లా):,పేదల సంక్షేమమే, గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన మాసంపెళ్లి వనజ – అఖిల్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్, సొసైటీ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు, చిట్యాల తిరుపతి , చార్ల శివారెడ్డి,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


