ప్రేమ విఫలంతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్‌లో చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ నిభాశ్ (25) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రేమ వ్యవహారంతో కొంతకాలంగా నిభాశ్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తన స్నేహితులకు వాట్సప్ ద్వారా సమాచారం పంపించాడు. దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన తిరుమలనగర్‌లోని ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే నిభాశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిభాశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. వాట్సప్‌లో పంపిన సందేశాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

