నేరాల నియంత్రణే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్‌

రాంపుర్‌లో పోలీసుల తనిఖీలు.. వాహనదారులకు జరిమానాలు

నేరాల నియంత్రణే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్‌

బెల్లంపల్లి మంచిర్యాల : నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు కాసిపేట మండలం దేవాపూర్‌ పోలీసులు రాంపుర్‌ గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ గంగారం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు ట్రాలీలను తనిఖీ చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గంగారం మాట్లాడుతూ సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులను ఓపెన్‌ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. ఫేక్‌ కాల్స్‌, ఫిషింగ్‌ మెసేజ్‌లు, సోషల్‌ మీడియా మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, హెల్మెట్‌, సీటుబెల్ట్‌ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112కు ఫోన్‌ చేయాలని చెప్పారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలతో పాటు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని ఎస్‌ఐ తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాపూర్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 87

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!