గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
ప్రజా సమస్యలను తీర్చి,గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రజావాణిలో అర్జీ పెట్టిన తాటికొండ కృష్ణమాచారి,వెంకటేశ్వర్లు
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజా సమస్యలను తీర్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామంలోని తాటికొండ కృష్ణమాచారి,వెంకటేశ్వర్లు ప్రజావాణిలో మండల అభివృద్ధి అధికారికి ఆర్జీ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గ్రంథాలయ శాశ్వత భవన నిర్మాణం,సబ్ పోస్ట్ ఆఫీస్ శాశ్వత ఏర్పాటు, ఎల్ సి 32 రైల్వే గేటు నుండి డి 86 కెనాల్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు 60 ఫీట్ల రోడ్డు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల భద్రత కోసం సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆఫీస్ ఏర్పాటు,కరీంనగర్ పోయే ప్రధాన రహదారి ఓదెల నుండి కనగర్తి రోడ్డు వెడల్పు,రైల్వే స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ల నిలుపుదల తో పాటు సమయపాలన, అదేవిధంగా మంథిని,కరీంనగర్ ల నుండి ఓదెల దేవస్థానం కు భక్తుల,విద్యార్థుల సౌకర్యార్థం,ఆర్టీసీ బస్సులు నడిపించాలని, వ్యవసాయ మార్కెట్, జనాభా ప్రాతిపదికన 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మించడం, ఫైర్ స్టేషన్ లాంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న అభివృద్ధి పనులను చేయాలని వినతి పత్రంలో ఆర్జీ పెట్టుకున్నట్లు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


