కళ్లెంలో ఘనంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి : సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి

కళ్లెంలో ఘనంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ

 

 

లింగాల గణపురం (జనగాం) : కళ్లెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాకలక్ష్మి, వార్డు సభ్యులు, PACS చైర్మన్ బుషిగంపల ఉపేందర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లావణ్య రమేష్, దేవస్థాన చైర్మన్ ఏలే నర్సింహులు (మూర్తి), కళ్లెం కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు లింగాల సంపత్, కళ్లెం దేవస్థాన అధ్యక్షుడు జిల్లెల్ల వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి, గ్రామ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 111

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!