రాయికోడ్ మండల ఎంఆర్ పిఎస్ నూతన కమిటీ ఎన్నిక

-మాదిగల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం – ఎంఆర్ పిఎస్ నాయకులు

రాయికోడ్ మండల ఎంఆర్ పిఎస్ నూతన కమిటీ ఎన్నిక



సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండల  మాదిగల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నిరంతరం పోరాడుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యంఆర్ పి ఎస్ ) మండల నూతన కమిటీని ఆదివారం నాడు ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నూతన కమిటీగా మండల అధ్యక్షులుగా మీడిదొడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా నడిమిదొడ్డి రాజు, ఎల్గొయ్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా అనిల్ తదితరులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మాదిగల హక్కుల సాధన కోసం ఎంఆర్ పిఎస్ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మాదిగలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు మరియు సామాజిక న్యాయం అందే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.రాయికోడ్ మండలంలోని ప్రతి గ్రామంలో మాదిగలను సంఘటితం చేసి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని నూతన కమిటీ నాయకులు తెలిపారు. మాదిగల అభివృద్ధి, విద్య, ఉపాధి మరియు రాజకీయ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యంఆర్ పిఎస్ నాయకులు, కార్యకర్తలు, గౌరవ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!