రోడ్డు ఇలా ఉంటే వేళ్లే దేలా..!
చెరువును తలపిస్తున్న దుబ్బతండా క్రాసింగ్ నుంచి పేర్మల్ బండా రోడ్డు బూరుదమయం
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులు తండా గ్రామ పంచాయతీ పరిధీలోని దుబ్బతండా క్రాసింగ్ నుంచి చాపతండా గ్రామ పంచాయతీ పరాధీలోని పేర్మల్ బండా వరకు వేళ్లే రహదారి చిన్నపాటి వర్షాలకి చిత్తడి చిత్తడిగా మారి కనీసం నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నదని తండావాసులు వాపోతున్నారు. మా తండాకు అధికారులు పట్టించుకోరు పాలకులు పట్టించుకోరు అని,రోడ్డు పరిస్థితి ఏమిటని,ఏమిటి దుస్థితి అని ప్రశ్నిస్తున్నారు. అక్కన్నపేట మండలంలోని పంతులు తండా గ్రామం పంచాయతీ పరిధిలో దుబ్బతండా క్రాసింగ్ నుంచి చాపతండా గ్రామ పంచాయతీ పరిధిలో పేర్మల్ బండాకు వేళ్లే మట్టిరోడ్డు అధ్వానంగా ఉందని రోడ్డు ఇలా ఉంటే నడిచేది ఎలా అంటూ బిజేపి అక్కన్నపేట మండల కార్యదర్శి రైనా నాయక్ అసహనం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులతో పాటు పాల కేంద్రం కోసం దుబ్బతండా నుంచి నిత్యం పేర్మల్ బండాకు ఈ రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తుంటారని,రోడ్డంతా బురదమయంగా మారిందని రైనా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి రోడ్డును బాగు చేయాలని స్థానిక మంత్రి పోన్నం ప్రభాకర్ ని తండా ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


