గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా జాదవ్ ప్రవీణ్.

గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా జాదవ్ ప్రవీణ్.

బోధన్, (నిజామాబాద్):హైదరాబాద్ నగరంలో ఆదివారం గిరిజన విద్యార్థి సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ,రాష్ట్ర, జిల్లాల నూతన కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా రెండవ సారి జాదవ్ ప్రవీణ్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొర్ర బంతిలాల్ నాయక్,  ఉపాధ్యక్షులుగా బర్మావత్ నరేష్ నాయక్ లను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ధారావత్ గణేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు వెంకట్ బంజారా, జాతీయ నాయకులు ఇందల్ రాథోడ్,  రాష్ట్ర అధ్యక్షులు మూడ్ బాలాజీ నాయక్, జీవీఎస్ నాయకులు రవీందర్ నాయక్, వడిత్య రమేష్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, బాలాజీ నాయక్, డాన్ శీను నాయక్, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.  గిరిజన విద్యార్ధి సంఘం ఎల్లప్పుడూ  బంజారాల అభివృద్ధి కొరకు విద్యార్థుల హక్కుల కోసం ఎల్లవేళలా పోరడాలని అన్నారు కలసి కట్టుగా జాతి అభివృద్ధికి కొరకు కృషి చేయాలనీ అందరూ సమన్వయంతో పని చేయాలని ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు సూచించారు. 

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!