కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్

సేవలను కొనియాడిన సీపీ గౌష్ ఆలం 

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్

కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM)దక్కింది. ఆగస్టు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అరుదైన మెడల్ ను అందుకున్న నేపథ్యంలో సీఐకి అభినందనల వెల్లువెత్తుతున్నాయి.సోమవారం సీఐ నిరంజన్ రెడ్డి కరీంనగర్ సీపీ గౌష్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సీఐ నిరంజన్ రెడ్డి సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం కరీంనగర్ కమిషనరేట్ కు గర్వకారణమని అన్నారు. పోలీస్ విభాగంలో నిజాయితీగా శ్రమించి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, సమాజ హితం కోసం పనిచేసి ఇలాంటి అరుదైన మెడల్స్ కు ఎంపిక కావాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. ఐపీఎం అందుకున్న అనంతరం తొలిసారి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సీఐ నిరంజన్ రెడ్డికి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అత్యంత అరుదైన మెడల్ అందుకోవడం గర్వంగా ఉందని, నిరంజన్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సిబ్బంది అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో స్టేషన్ పరిధిలోని ప్రజలు కూడా సీఐని ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న సీఐకి ఇలాంటి గుర్తింపు దక్కడం సంతోషంగా ఉందని ప్రజలు పేర్కొన్నారు.
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News