జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా సెప్టెంబర్ 1 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ - 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్, తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రధాన నిబంధనలు:1. డీఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదు.
2. ప్రజలు గుమిగూడే విధంగా కార్యక్రమాలు, సన్నాహాలు చేయరాదు.
3. కత్తులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇతర నిషేధిత ఆయుధాలు కలిగి ఉండరాదు.
4. అధిక శబ్దం వచ్చే డీజేలు, లౌడ్ స్పీకర్లు, ప్రచార రథాలు, మైకులకు అనుమతి లేదు.
5. రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ముందస్తుగా దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


