ఆడపిల్ల పుడితే రూ.5 వేల కానుక.. మాట నిలబెట్టుకున్న సర్పంచ్ దంపతులు
చౌటకూర్,: చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు కానుక అందజేస్తామని ఇచ్చిన హామీని గ్రామ సర్పంచ్ చంటి గీతారాణి–రమేష్ దంపతులు నెరవేర్చారు.గ్రామానికి చెందిన భూత కిష్టాపూర్ కుటుంబంలో కుమార్తె జన్మించడంతో సర్పంచ్ దంపతులు రూ.5 వేల నగదు కానుకను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడంతో పాటు, బాలికల పట్ల సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ కానుకను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్ యాదవ్, వార్డు సభ్యులు చెన్నం రెడ్డి, గంట ప్రేమమ్మ, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చన్నం రెడ్డి, శ్రవణ్ గౌడ్, గంట సత్యం, నేత ప్రభాకర్, శ్రీశైలం యాదవ్, మైనార్టీ అధ్యక్షుడు రషీద్ భాయ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


