జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, మాల సంఘం నాయకులు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. నూతన దేవాలయాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు సొంత నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, సామాజిక సమైక్యతను పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే అన్నారు. జిన్నారం ప్రాంత ప్రజల భక్తి విశ్వాసాలకు అనుగుణంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం తనవంతుగా రూ.12 లక్షల భారీ విరాళాన్ని అందించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో జిన్నారం ప్రాంత ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల మాజీ జెడ్ పి టి సి కోలాన్ బాల్‌రెడ్డి, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం జి.వెంకటేష్‌గౌడ్, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ నక్కిర్తి జనార్ధన్, బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మద్ది రవీందర్ రెడ్డి, రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి డా.ఏర్పుల శ్రీనివాస్, జిన్నారం మాజీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, జిన్నారం మాజీ ఎం పి టి సి శ్రీనివాస్ రెడ్డి, యువజన సంఘాల తాలూకా కన్వీనర్ గొర్ల శ్రీనివాస్ యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ జిన్నారం మండల అధ్యక్షులు నాయి కోటిరాజేష్, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాల సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ఏర్పుల లింగం, తోట నర్సింగరావు, జోగు వెంకటేష్, ఏర్పుల సత్యనారాయణ, పోచమ్మల ఎల్లయ్య, ఏర్పుల అశోక్, పోచమ్మల స్వామి, ఏర్పుల వినేష్, పోతరాజు శేఖర్,ఏర్పుల భాస్కర్, పోతరాజు మహేందర్, ఏర్పుల నరసింహ, ఏర్పుల వీరేష్, కొంపల్లి కిషన్, జిన్నారం రాము, బలరాం, జిన్నారం ఎల్లయ్య, కాడని యాదయ్య, కాడెన్న నరసింహులు, భక్తులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


