అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు గా

దేశామోని ఆంజనేయులు, అల్వాల మధు గౌడ్

అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు గా

నాగర్ కర్నూల్ ప్రతినిధి : అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా మూడవ మహాసభలు 27/08/2026 గురువారం రోజున పెద్దకొత్తపల్లి  మండల కేంద్రంలోని ఏ ఐ వై ఎఫ్ మూడో మహాసభలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు  ముఖ్య అతిథులు ఏఐవైఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు   సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  ఎం.బాల్ నరసింహ. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్  ముఖ్య అతిథులుగా హాజరై ఈ సభ సమావేశం అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా  దేశామోని ఆంజనేయులు మధు గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మాపై  నమ్మకంతో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగాఎన్నుకున్నందుకుధన్యవాదాలుతెలుపుతూ నాగర్ కర్నూల్ జిల్లాలోని విద్య వైద్యం ఉపాధి హక్కుల కోసం పోరాటాలు ఇంకా ఉధృతం చేసి యువత ఎదుర్కొంటున్న సమస్యలను   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య విధానాలను యువతతో కలిసి పోరాటాలు నిర్వహిస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్  కార్య నిర్వహణ కార్యదర్శి గా  కేసుముల్లా శివకృష్ణ  జిల్లా ఉపాధ్యక్షులుగా వాడల బాల పిరు సహాయ కార్యదర్శులు  ధర్మరాజు మరియు శివుడు తో పాటు 15 మంది కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News