పేదల సంక్షేమమే..

పేదల సంక్షేమమే..

  • గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం
  • నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
  • ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఎమ్మెల్యే 

వరంగల్ (నల్లబెల్లి ): నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మాసంపెళ్లి వనజ – అఖిల్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికిముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు  దొంతి మాధవరెడ్డి  హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేద కుటుం బానికి సొంత ఇల్లు కల్పించడమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులై న ప్రతి నిరుపేద కుటుంబం గృహ కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Views: 57

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!