సన్నరకాల బోనస్ ఆన్ లైన్ నమోదు చివరి తేదీ సెప్టెంబర్ 10 వ తేదీ.
ఓదెల : ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల సన్నరకాల వరి విత్తనాలు తీసుకున్న రైతుల సంబంధిత విత్తనాలు కొనుగోలు చేసిన విత్తన దుకాణాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు.రైతు సోదరులు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డ్,విత్తన కొనుగోలు చేసిన రశీదు,తీసుకొని సంబంధిత విత్తన దుకాణం లో సంప్రదిం చాలన్నారు. కౌలు రైతులు కూడా తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.అలా చేస్తే కౌలు రైతులకు బోనస్ నేరుగా కౌలు రైతు అకౌంట్ లో జమ అవుతుందన్నారు.రైతులు విత్తన దుకాణాల్లో కాకుండా ప్లాంట్,రైతు దగ్గర విత్తనం తీసుకొని విత్తుకున్న రైతులు గ్రామ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.బోనస్ వర్తించే 7 రకాల్లో ఆర్ఎన్ఆర్ 15048, బిపిటి 5204, కే ఎన్ ఎం 1638, హెచ్ఎంటి సోనా, డబ్ల్యూ జి ఎల్ 44, కేఎన్ఎం 7715,జైశ్రీరామ్ సన్నరకాల బోనస్ సెప్టెంబర్ 10వ తేదీ లోపు రైతులందరూ ఆన్లైన్ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకొని రైతులకు బోనస్ వర్తించదని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


