సామజిక సేవలో మెగావత్ చందు నాయక్ కు గౌరవ డాక్టరేట్

సామజిక సేవలో మెగావత్ చందు నాయక్ కు గౌరవ డాక్టరేట్

  • మెగావత్ చందు నాయక్ కి గౌరవ డాక్టరేట్
  • లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం
  • ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది  

నల్గొండ /మర్రిగూడ:తెలంగాణ సరస్వతి పరిషత్ లో నిర్వహించిన సమావేశంలో ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్  యూనివర్సిటీ  అండ్ స్ఫూర్తి అకాడమీ వారి నుంచి గౌరవ డాక్టరేట్  అవార్డును అందుకున్నారు. మర్రిగూడ మండలం  అజ్జలాపురం గ్రామానికి చెందిన మేగావత్ చందు నాయక్ గత తొమ్మిది సంవత్సరాలుగా సామాజిక సేవ ప్రజా సంక్షేమం విద్యార్థుల హక్కులు గ్రామీణ అభివృద్ధి ప్రజా సంక్షేమం విద్యుత్ మంచినీటి సమస్యపై పేదరిక నిర్మూలన కోసం ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషిచేసిన సామాజిక సేవకు చందు నాయక్ కు అరుదైన గౌరవం దక్కింది ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ  అండ్ స్ఫూర్తి అకాడమీ వారి ఆధ్వరంలో ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేసినారు. అజ్జలాపురం గ్రామానికి చెందిన శ్రీమతి మెగావత్ పరెంగ బాయి హార్య నాయక్ లకు రెండోవ సంతానంగా జన్మింనాడు.చిన్ననాటి నుంచే విద్యార్థి దశ నుంచి సమాజ సేవ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. సామాన్య ప్రజల సమస్యలను భావిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.స్వామి వివేకానంద. మహాత్మా గాంధీ. జ్యోతిరావు పూలే. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ ల ఆశయాల కు అనుగుణంగా వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం గిరిజన విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 2023 లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా.మరియు 2024లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ గా పోటీ చేయడంతో పాటు గ్రామాలలో ఆర్టీసీ రవాణా సౌకర్యం లేని గ్రామాలకు ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించడం కోసం అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని . గ్రామంలో శ్రమదానంలో భాగంగా మురికి  కాలువలు శుభ్రం చేయడం. రైతుల విద్యుత్ స్తంభాల  సమస్యలు వీధి దీపాలు ఏర్పాటు చేయడం. మొక్కలు నాటడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వపథకాలకు దరఖాస్తులు చేసుకోవ డంలో సహకరించడం. నిత్యం ఏ సమస్య ఉన్నా తను ముందుండి పరిష్కార మార్గం కోసం కృషి చేయడం ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి. సామాజిక కార్యక్రమాలను వివిధ పత్రికల ద్వారా సామాజిక మధ్యమాల ద్వారా గుర్తించిన. ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ స్ఫూర్తి అకాడమీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. డాక్టరేట్ అవార్డు గ్రహీత మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. ఇక ముందు ముందు కూడా రెట్టింపు బాధ్యతతో ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుట కోసం కృషి చేస్తానన్నారు

Views: 152

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!