హిందూ పండుగల వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు దారుణం

బీజేపీ నేత నాయిని సందీప్ కుమార్ ఆగ్రహం

హిందూ పండుగల వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు దారుణం

 

 

గజ్వేల్/సిద్దిపేట : రాఖీ పండుగ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా తెలంగాణ ఆర్టీసీ అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించకపోవడంపై గజ్వేల్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పండుగలు వచ్చిన ప్రతిసారీ ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల భారం మోపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు గా మారిందని ఆయన మండిపడ్డారు. సాధారణ రోజుల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుండి హైదరాబాద్ (జేబీఎస్)కి బస్సు ఛార్జీ రూ. 90 ఉండగా, పండుగ స్పెషల్ పేరిట ఒక్కో టికెట్‌పై ఏకంగా రూ. 140 వసూలు చేస్తున్నారు. పండుగ లు ముగిసినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రద్దీని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తోందని విమర్శించారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే ఉపసంహరించి, యథావిధిగా సాధారణ ఛార్జీలనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Views: 52

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!