ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
కంటనీరు పెట్టుకున్న ఉపాద్యాయులు.
వికారాబాద్: పూర్వ విద్యార్ధులు విద్యాబోధన చేసిన గురువులను స్తుతిస్తూ ఆదరించడంతో వృద్ధాప్య దశలో ఉన్న వారు కంట నీరు పెట్టుకుంటూ ఆనంద భాష్పాలను రాల్చారు. పరిగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెం.1 లో 1988-89 సంవత్సరం పదో తరగతి చదువుకున్న విద్యార్ధులు ఆదివారం సాయంత్రం పరిగిలోని ఓ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వేదికపై ఉపాధ్యాయులు, విద్యార్థులు గత స్మృతుల ను నెమరు వేసుకున్నారు. ఉన్నత స్తాయికి చేరుకుని స్థిరపడిన తమ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు గర్వపడ్డా రు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి వారి నుంచి ఆశీర్వాదాలు పొందారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


