ఇందిరమ్మ ఇల్లు.. పేద కుటుంబానికి సొంతింటి భరోసా

ఇందిరమ్మ ఇల్లు.. పేద కుటుంబానికి సొంతింటి భరోసా

ముత్తారం, : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన లింగంవార్ మంజుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొట్టె అన్నపూర్ణ ఉపేందర్ హాజరై మంజుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతోఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం,ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వీరగోని అజయ్,లక్కం లక్ష్మి ప్రభాకర్, ముత్తారం స్వర్ణకారుల మండల అధ్యక్షుడు అకోజు అశోక్‌చారి,యువ నాయకుడు మెట్టు రాకేష్  పాల్గొన్నారు.

Views: 122

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!