ఖదీమ్ కబ్రస్తాన్‌ను వెంటనే శుభ్రపరిచి అభివృద్ధి చేయాలి: సయ్యద్ ఇబ్నీ అఫాన్

ఖదీమ్ కబ్రస్తాన్‌ను వెంటనే శుభ్రపరిచి అభివృద్ధి చేయాలి: సయ్యద్ ఇబ్నీ అఫాన్

మంచిర్యాల టౌన్: మంచిర్యాల పట్టణంలోని బస్ స్టాప్ ఎదురుగా ఉన్న ఖదీమ్ కబ్రస్తాన్ (అఖదీమ్ కబ్రస్తాన్‌) అధ్వాన్న పరిస్థితుల్లో ఉందని AIMIM జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్నీ అఫాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కబ్రస్తాన్‌లో పిచ్చి మొక్కలు, పొదలు విపరీతంగా పెరిగిపోవడంతో సరైన నిర్వహణ లేకుండా పోయిందన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో మృతదేహాలను ఖననం చేసేందుకు కబ్రస్తాన్‌కు తీసుకువచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పొదలు అధికంగా పెరగడంతో పాములు మరియు ఇతర విషపూరిత జీవులు సంచరిస్తుండటం వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందనీ, కబ్రస్తాన్‌ను వెంటనే పూర్తిస్థాయిలో శుభ్రపరిచి, పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించాలని కోరారు. అలాగే కబ్రస్తాన్‌లో క్రమం తప్పకుండా శుభ్రత, నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖదీమ్ కబ్రస్తాన్ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి రహదారులు, నడక మార్గాలు, లైటింగ్, ప్రహరీతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని సయ్యద్ ఇబ్నీ అఫాన్ కోరారు. స్థానిక ప్రజల సౌకర్యం, భద్రత దృష్ట్యా మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ షాకీర్, అహ్మద్ మాజీ కౌన్సిలర్ సయ్యద్ హబీబ్, మహమ్మద్ సమీర్, మహమ్మద్ బబ్బు, AIMIM జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్నీ అఫాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కబ్రస్తాన్‌లో పిచ్చి మొక్కలు, పొదలు, జమ్ము విపరీతంగా పెరిగిపోవడంతో సరైన నిర్వహణ లేకుండా పోయిందన్నారు. ఈ విషయంపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News