వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్’
డే కేర్ సెంటర్‌లో వృద్ధులతో కలిసి అల్పాహారం చేసిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: వృద్ధాప్యంలో ఒంటరితనానికి దూరంగా, ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపేందుకు ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లు చక్కటి వేదికగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వయోవృద్ధులకు సాంత్వన, మానసిక ఉల్లాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలో సోమవారం ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ కేంద్రంలోని వసతులను పరిశీలించారు. వృద్ధులకు అందుతున్న సేవలు, కల్పించి న సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు.అనంతరం కలెక్టర్ స్వయంగా వృద్ధులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి అల్పాహారం చేశారూ.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుతున్న జీవన విధానంతో వయోవృ ద్ధులు ఒంటరితనానికి గురికాకుండా పగటి సమయంలో ఆహ్లాదకరంగా గడిపేందుకు ‘ప్రణామ్’ కేంద్రం ఉపయోగప డుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


