ముత్యంపేట జెడ్ పి హెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు చేతిరాత శిక్షణ
జగిత్యాల, మల్యాల : విద్యార్థి దశలోనే చక్కని చేతిరాత అలవర్చుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనదని, మంచి రాత భవిష్యత్తుకు బలమైన పునాది అని వక్తలు పేర్కొన్నారు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థుల చేతిరాత నైపుణ్యాల అభివృద్ధి కొరకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిం చారు. మర్రి మల్లేశం, పూడూరి గంగస్వామి ఆధ్వర్యంలో ఈ శిక్షణ విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్పష్టమైన, అందమైన చేతిరాత ద్వారా పరీక్షల్లో మంచి మార్కులు సాధించవ చ్చని, ప్రతి విద్యార్థి రోజువారీ సాధనతో రాతను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు చేతిరాత మెలకువలను ప్రత్యక్షంగా వివరించి సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య, ఉప సర్పంచ్ కందరి ముత్యంరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విష్ణువర్ధన రెడ్డి, దశరథ్ రెడ్డి, శ్రీనివాస్, గంగ, అనూష తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

