పోచమ్మ బోనాల పండుగ
సార్గమ్మ పునఃప్రతిష్ఠా వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న పోచమ్మ బోనాల పండుగ, సార్గమ్మ పునఃప్రతిష్ఠా వేడుకల్లో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సమృద్ధిగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.అనంతరం పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


