ముత్యంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, యూనిఫాం పంపిణీ

ముత్యంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, యూనిఫాం పంపిణీ

​మల్యాల: మల్యాల మండల పరిధిలోని ముత్యంపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యా యులు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువు లు చదవాలని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, విద్యార్థులందరూ చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, లక్ష్యంతో చదువుకొని పాఠశాలకు, గ్రామా నికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దారం ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ కందరి ముత్యం రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షు డు పూడూరి గంగస్వామి, మర్రి మల్లేశం, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Views: 116

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!