ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున మండల న్యాయ సేవాధికారి సంస్థ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు హుస్నాబాద్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట జడ్జ్ కే సౌజన్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అందులో భాగంగా నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకో ఫ్యాట్రిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్ డి పి ఎస్) యాక్ట్ 1985 గురించి విద్యార్థులకు వివరించారు. ఈ వ్యక్తి అయినా డ్రగ్ వాడిన, డ్రగ్ కలిగి ఉన్నా, డ్రగ్ అమ్మిన డ్రగ్స్ కు సంబంధించి ఏ విధమైన ఇల్లీగల్ ఆక్టివిటీస్ లో పాల్గొని న సుమారుగా 6 నెలల నుండి 10 సంవత్సరాల నాన్ బెయిలబుల్ జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని, విద్యార్థులు జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వారు అవుతారని, తద్వారా కుటుంబాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ హుస్నాబాద్ ప్రమిద మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని, మంచిగా చదువుకొని వివిధ రంగాలలో, వివిధ హోదాలలో స్థిరపడాలని పేర్కొన్నారు, కానీ యువత డ్రగ్స్ కు బానిసలై, పెడదారి పట్టి, జీవితాలు నాశనం కావడంవల్ల చివరికి దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించన గవర్నమెంట్ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ కళాశాలలో ఆంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేశామని విద్యార్థులంతా ఆంటీ డ్రగ్ సోల్జర్స్ గా అందులో చేరారని, డ్రగ్స్ బారిన పడమని, డ్రగ్స్ జోలికి వెళ్ళమని, డ్రగ్స్ మా కుటుంబాల్లోకి రానివ్వమని,డ్రగ్స్ ను సమాజం నుండి తరిమి వేయాలని, నిషాముక్త్ భారత్ వైపు అడుగులు వేయాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆంటీ డ్రగ్ కమిటీ ఇన్చార్జ్ డాక్టర్ పి. బాలరాజు, కుమారస్వామి,విజయ, వి. శ్రీనివాస్, సిహెచ్ రమేష్, జి. శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


