సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ

సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యం 
ఆర్ జె డి అజ్మీర గోపాల్
56 మంది అధ్యాపకులకు ఓరియంటేషన్..
8 మంది జిల్లా రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపిక

కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల రీజనల్ జాయింట్ డైరెక్టర్ అజ్మీర గోపాల్ కార్యక్రమంలో పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు కార్యక్రమంలో పాల్గొని శిక్షణకు సంబంధించిన అంశాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఎకనామిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, గణిత శాస్త్రం సబ్జెక్టులకు చెందిన మొత్తం 56 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. వీరిలో 8 మందిని జిల్లా రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపిక చేసి, సబ్జెక్టు మార్పుపై ప్రత్యేక శిక్షణ అందించారు. సబ్జెక్టు మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు కొత్త సబ్జెక్టులపైపూర్తి అవగాహన, నైపుణ్యం సాధించేలా శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పొందిన జిల్లా రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఇతర అధ్యాపకులకు కూడా అవసరమైన శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా అధ్యాపకులు ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా తయారై, విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News