ఆదిలాబాద్ ను అగ్రగామిగా నిలుపుతాం : సీఎం రేవంత్ రెడ్డి

సంవత్సరం లోగా ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ ...

ఆదిలాబాద్ ను  అగ్రగామిగా నిలుపుతాం : సీఎం రేవంత్ రెడ్డి

మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం  : సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ : టిపిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదట ఇంద్రవెల్లి కి వచ్చిన తాను, పోరాట యోధుల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజా సంక్షేమానికి అలుపెరుగని కృషి చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి, సి ఎస్ ఆర్ నిధుల ద్వారా అదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, కలెక్టరేట్ భవన సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్, పోలీస్ గృహ సముదాయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు.  అనంతరం పట్టణ మహిళా సమాఖ్య - 160 స్వయం సహాయక సంఘాలకు 19కోట్ల 69 లక్షల 33 వేల రూపాయల బ్యాంకు రుణం చెక్కును అందజేశారు.  

IMG-20251204-WA0055 (1)

ఆదిలాబాద్  లో యూనివర్సిటీ నెలకొల్పుతాం...
ఈ సంసంర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ఆదిలాబాద్ జిల్లాను వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాబోవు 2 నెలలలో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలపై అధికారులను, ప్రజా ప్రతినిధులను ఒకచోట చేర్చి నివేదికలు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందుకు జిల్లా ఇన్చార్జ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీని కేటాయించే బాధ్యత తనదని, జిల్లాలో ఆ యూనివర్సిటీని ఎక్కడ నేలకొల్పుతారో జిల్లాలోని రాజకీయ నాయకులందరూ ఐక్యంగా నిర్ణయించుకొని దానికి సంబంధించిన ప్రతిపాదనలను తనకు పంపితే, వెనువెంటనే అందుకు సంబంధించిన కార్యచరణ మొదలు పెడుతానని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ ఇంద్రవెల్లి లోనే నెలకొల్పితే బాగుంటుందని ఇక్కడి నాయకులకు సీఎం సూచించారు. అదేవిధంగా మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని, అందుకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలిపారు. 

IMG-20251204-WA0059

పార్టీలకు అతీతంగా పని చేస్తున్న  ప్రభుత్వం తమది : సీఎం 

ఎంపీ నగేష్, ఎం.ఎల్.ఎ పాయల్ శంకర్ లు ఆదిలాబాద్ లోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా.. తాను పార్టీలకు అతీతంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. అన్ని వర్గాల అభివృద్ధికి  చేస్తున్నానని అన్నారు.   సంవత్సరం లోగా ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ పనులను ప్రారంభించి ఎయిర్ బస్సులను నడిపిస్తామని తెలిపారు.  దీంతో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది, జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో రోడ్ల నిర్మాణంతో పాటు, అదిలాబాదులోని వెనుకబడిన కాలనీల అభివృద్ధికి, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతు వారి సంక్షేమానికి పాటుపడుతానని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ప్రతినిధి పూర్ణ చందర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.  

IMG-20251204-WA0057

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్  మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 
హైదరాబాద్: మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు యువత...
శేషమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు 
దాకూరి గాలయ్య 35వ  వర్ధంతి  ఘన నివాళి-  
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన సొసైటీ చైర్మన్ : ఎర్రబెల్లి రఘుపతి రావు 
పాలమూరు మహేందర్ ను అకారణంగా కొట్టిన తిమ్మాజిపేట్ ఎస్సై
సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రక్తదానంతో తలసేమియా బాధితులకు పునర్జన్మ