ఆగస్టు 31న మాలల చలో సెక్రటేరియట్ ముట్టడి
గంభీరావుపేట : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు మాల అనుబంధ కులాలకు విద్య ఉద్యోగాలు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని నిరసిస్తూ బుధవారం ఎస్సీ రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించకపోతే, ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని పిలుపునిస్తూ గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల మాలలు మరియు మాల ఉప కులాలు విద్యార్థులు యువతి యువకులు అన్ని గ్రామాల నుండి తరలిరావాలని సెక్రటేటివ్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్యవేదిక జిల్లా నాయకులు ఎగదండి స్వామి బండ రమేష్ రెడ్డి మల్ల రాజనర్సు ఎడబోయిన రాజు మల్యాల రాజ్ మీరు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


