ఆమనగల్లులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
ఆమనగల్లు: పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ వేడుకలను నూరే ముస్తఫా నౌజవాన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, కౌన్సిలర్ వెంకటయ్య హాజరై మిలాద్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముస్లిం పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులు పచ్చజెండాలు చేతబట్టి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను పాటించాలని పలువురు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండీ మాసుమ్, అఫ్జల్, ఏంఏ పాషా, నాయుమ్, నౌజవాన్ కమిటీ నాయకులు అహ్మద్, హఫీజ్, అసద్, మూస, సమీర్, జునైద్, గౌస్, అక్బర్, మహబూబ్, షరీఫ్, ఫిద్దు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


