పరకాల అభివృద్ధికి సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వాలి
వ్యవసాయ మార్కెట్‌లో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేయాలి
ఆయిల్‌ఫామ్ రైతులకు అనుకూలంగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
వ్యవసాయ, ఉపాధి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి
మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ : నక్క చిరంజీవి
హనుమకొండ /పరకాల : ఈనెల 16న, ముఖ్యమంత్రి పరకాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన పరకాల అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన హామీలు ఇవ్వాలని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్క చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ప్రయోజనాల కోసం కోల్డ్‌స్టోరేజ్ నిర్మించాలని కోరారు.పరకాల ప్రాంతంలో ఆయిల్‌ఫామ్ సాగు విస్తరిస్తున్నందున రైతులకు ప్రయోజనం చేకూరేలా ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరకాలలో పండ్ల మార్కెట్, చేపల మార్కెట్ లను, ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని చిరంజీవి కోరారు. ప్రతిపాదిత పరిశ్రమల ఏర్పాటుతో వెనుకబడిన పరకాల ప్రాంత అభివృద్ధికి దోహద పడటంతో పాటు వ్యవసాయ రంగం బలోపేతమై రైతులు, కార్మికులు, మహిళలు, యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, పరకాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీలు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
