జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
లబ్ధిదారులకు అందజేసిన కౌన్సిలర్లు యన్నం కోటేశ్వరరావు,దోర్నాల శిరీష-వెంకటరవి
మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ కౌన్సిలర్లు యన్నం కోటేశ్వరరావు గారు మరియు దోర్నాల శిరీష-వెంకటరవి గారు హాజరై లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినందుకు ప్రభుత్వానికి, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపిఓ వెంకటరమణి గారు, రేషన్ డీలర్ పాశం విజయ గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరువీధుల వెంకటేశ్వరరావు గారు, డివిజన్ అధ్యక్షులు దోర్నాల నాగ మురళి గారు,కోరంపల్లి చంటి గారు, మరియు మహిళలు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆర్పీలు, గ్రామ పెద్దలు, లబ్దిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


